ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం: ఎంపీ CM ramesh

ABN , First Publish Date - 2022-07-14T19:20:56+05:30 IST

ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమని ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు.

ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం: ఎంపీ CM ramesh

కడప: ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమని ఎంపీ సీఎం రమేష్(CM ramesh) స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... పేదల ఆకలి కేకలు వైసీపీ (YCP) ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. పేదలను విస్మరించిన ప్రభుత్వం మనుగడ సాగించిన దాఖలాలు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్ క్రింద విద్యార్ధులకు విద్యా కానుకగా అందిస్తోందని తెలిపారు. మీడియాకు పత్రికా ప్రకటన కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు జగన్ స్టిక్కర్ వేసుకొని అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి, శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. అరాచకాలు, అక్రమాలు, దోపిడీ తప్ప అభివృద్ధి చేసింది శూన్యమని ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలు చేశారు. 

Read more