-
-
Home » Andhra Pradesh » bjp leader somuveerraju vijayawada andhrapredesh suchi-MRGS-AndhraPradesh
-
Somuveerraju: వైసీపీవి మైండ్ గేమ్ పాలిటిక్స్
ABN , First Publish Date - 2022-10-11T19:34:50+05:30 IST
వైసీపీవి మైండ్ గేమ్ పాలిటిక్స్ అని ఏపి బీజేపీ అధ్యక్షులు సోమువీర్రాజు అన్నారు.

విజయవాడ: వైసీపీ (YCP)వి మైండ్ గేమ్ పాలిటిక్స్ అని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోమువీర్రాజు (Somuveerraju) అన్నారు. మంగళవారం జరిగిన రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజధాని నిర్మించకుండా నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాజధాని కోసం రైతులు యాత్ర చేస్తుంటే వైసీపీ రాజకీయం చేస్తోందన్నారు. సీఎం (CM Jagan) ఇచ్చిన స్క్రిప్ట్‌నే మంత్రులు, ఎమ్మెల్యేలు చదువుతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు (YCP Leaders) భూదందాలు, అవినీతికి పాల్పడుతున్నారని సోమువీర్రాజు (AP BJP chief) ఆరోపించారు.