-
-
Home » Andhra Pradesh » bjp leader Kanna Laxminarayana fires on cm jagan VSp-MRGS-AndhraPradesh
-
Kanna laxminarayana: ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతావ్..!
ABN , First Publish Date - 2022-09-20T00:13:08+05:30 IST
ఏపీలో పాలన జరగటం లేదని.. జగన్ ప్రైవేటు కంపెనీ లిమిటెడ్ దోపిడీ వ్యాపారం మాత్రమే జరుగుతోందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ..

తిరుపతి (Tirupati): ఏపీలో పాలన జరగటం లేదని.. జగన్ ప్రైవేటు కంపెనీ లిమిటెడ్ దోపిడీ వ్యాపారం మాత్రమే జరుగుతోందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laxminarayana) అన్నారు. తిరుపతి సిటీలో నిర్వహించిన ‘బీజేపీ ప్రజాపోరు వీధి సభ’లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మైనింగ్, లిక్కర్, ఎర్రచందనం స్మగ్లింగ్, భూ కుంభకోణాలు, భూ ఆక్రమణలతో జగన్ దోపిడీ వ్యవస్థను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు దోచేశారని.. వైసీపీ నేతల పేరు వింటేనే అక్కడ భయపడే పరిస్థితి వచ్చేసిందన్నారు. 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్.. కర్ఫ్యూ పెట్టుకుంటే గానీ ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉందని విమర్శించారు. 2024లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.
‘‘ఏ అభివృద్ధి చేయక ప్రజల్లోకి వెళ్లే ధైర్యం జగన్‌కే లేనపుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా వెళ్తారని కన్నా లక్ష్మీనారాయణ నిలదీశారు. ‘‘దుర్బుద్ధి, దురుద్దేశంతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి అడ్రస్ లేని రాష్ట్రాన్ని చేసిన చరిత్రహీనుడు జగన్. అమరావతి రైతులు ఉత్తరాంధ్రలో కాళ్లు పెడితే జాగ్రత్త అని అసెంబ్లీలో అనటం సిగ్గు చేటు. తన బాబాయి వైఎస్ వివేకానందారెడ్డిని హత్య చేసింది చంద్రబాబు అని ఆనాడు చెప్పాడు. ఇప్పుడు సీబీఐ అధికారులను బెదిరించి నిందితులను అరెస్టులు చేయలేని విధంగా అసమర్ధపాలన చేస్తున్నాడు. ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత జగన్‌కు లేదు.’’ అని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.