రైతుల యాత్రకు బీజేపీ రక్షణ

ABN , First Publish Date - 2022-09-24T10:03:29+05:30 IST

రైతుల యాత్రకు బీజేపీ రక్షణ

రైతుల యాత్రకు బీజేపీ రక్షణ

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ 


విశాఖపట్నం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): అమరావతి రైతుల పాదయాత్రకు బీజేపీ రక్షణగా ఉంటుందని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ భరోసా ఇచ్చారు. వారిపై ఎటువంటి దాడి జరిగినా అది బీజేపీపై దాడిగానే పరిగణిస్తామని ప్రకటించారు. శుక్రవారం ఆయన విశాఖపట్నంలో మాట్లాడారు. రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి స్వయంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, దానిని ఎలా విస్మరిస్తారని అధికార పార్టీని ప్రశ్నించారు. ఎన్‌టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడాన్ని వైసీపీ నేతలే తప్పుబడుతున్నారని వ్యాఖ్యానించారు. పేరు మార్చడం సరికాదని వైఎస్‌ కుమార్తె షర్మిల కూడా చెప్పడాన్ని జగన్‌ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో తెలియడం లేదన్నారు. భారీస్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడి వైసీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. విశాఖలో స్టీల్‌ప్లాంటు తప్పనిసరిగా ఉంటుందని, ఇప్పటికంటే మెరుగైన జీతాలు ఇచ్చేందుకు కేంద్రం యోచిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక తప్పుడు పనులకు పాల్పడుతున్న వైసీపీ నాయకులు.. ఢిల్లీలో కేంద్రానికి అన్నీ చెప్పే చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారని, అదంతా అవాస్తవమన్నారు. ప్రసుతం బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతోందని, ఎన్నికల్లో కలిసే పనిచేస్తామని చెప్పారు.


Read more