ఏపీలో త్వరలో బీజేపీ పాదయాత్ర

ABN , First Publish Date - 2022-07-11T01:15:25+05:30 IST

ఏపీలో త్వరలో బీజేపీ పాదయాత్ర చేపట్టబోతోంది. పాదయాత్రపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

ఏపీలో త్వరలో బీజేపీ పాదయాత్ర

విజయవాడ: ఏపీలో త్వరలో బీజేపీ పాదయాత్ర చేపట్టబోతోంది. పాదయాత్రపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 25 పండిట్ దీనదయాళ్ జయంతి రోజు బీజేపీ పాదయాత్ర నిర్వహించాలని కాషాయపార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రాంతాల వారీగా జోన్లలో లేదా రాష్ట్రం మొత్తం.. ఒకేసారి పాదయాత్ర చేపట్టేలా ఏపీ బీజేపీ వ్యూహరచిస్తున్నారు. అధిష్ఠానం ఆదేశాల తర్వాత పాదయాత్రకు బీజేపీ సిద్దంకానుంది. రాష్ట్రంలో  రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం త్వరలో బీజేపీ పాదయాత్ర చేపడుతోందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేదన్నారు. ప్రభుత్వ ఆలోచనతో రైతులు సతమతమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ, టీడీపీ కలిసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆయన ఆరోపించారు. 


Read more