రాహుల్‌ పాదయాత్రతో బీజేపీ, ఆర్‌ఎస్ ఎస్ లో భయం

ABN , First Publish Date - 2022-10-05T08:41:25+05:30 IST

రాహుల్‌ పాదయాత్రతో బీజేపీ, ఆర్‌ఎస్ ఎస్ లో భయం

రాహుల్‌ పాదయాత్రతో బీజేపీ, ఆర్‌ఎస్ ఎస్ లో భయం

అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా

కాంగ్రెస్‌ పార్టీ ఏపీ, తెలంగాణ ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌


కర్నూలు(అర్బన్‌), అక్టోబరు 4: రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ భయపడుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. మంగళవారం కర్నూలు నగరంలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ జైరామ్‌ రమేష్‌, ఊమెన్‌ చాందీ, తులసిరెడ్డి, ఉత్తమకుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దిగ్విజయ్‌సింగ్‌ మాట్లాడుతూ.. జోడో యాత్ర కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం 3,575 కి.మీ. మేర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సాగుతుందని చెప్పారు. కేసీఆర్‌ స్థాపించబోయే పార్టీ బీఆర్‌ఎస్‌ 2024 తర్వాత వీఆర్‌ఎస్‌ పుచ్చుకోవాల్సిందేనని ఎద్దేవాచేశారు. 2024లో అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీఇచ్చారు. విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా బాధ్యత కాంగ్రె్‌సదేనని దిగ్విజయ్‌ సింగ్‌ స్పష్టంచేశారు. జైరామ్‌ రమేష్‌ మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి ఏపీలో రాహుల్‌ పాదయాత్ర కొనసాగనున్న నేపథ్యంలో కర్నూల్లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించామని తెలిపారు.


Read more