మహాగౌరి అలంకారంలో భ్రమరాంబ

ABN , First Publish Date - 2022-10-04T07:37:17+05:30 IST

శ్రీశైల మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం భ్రమరాంబ

మహాగౌరి అలంకారంలో భ్రమరాంబ

శ్రీశైలం, అక్టోబరు 3: శ్రీశైల మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం భ్రమరాంబ అమ్మవారు మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆది దంపతులకు నంది వాహన సేవ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా కుమారి పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్వామి, అమ్మవార్లకు మంగళవారం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

Read more