వివేకా హత్యలో జగన్‌ పాత్ర!

ABN , First Publish Date - 2022-03-16T08:28:17+05:30 IST

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం జగన్‌ పాత్ర, ప్రమేయం ఉన్నాయని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు.

వివేకా హత్యలో జగన్‌ పాత్ర!

‘మార్చి 15.. గొడ్డలి దినం’: బండారు సత్యనారాయణ


అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం జగన్‌ పాత్ర, ప్రమేయం ఉన్నాయని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. ఈ హత్య విషయంలో జగన్‌ ఆడిన అబద్ధాలు.. మడమ తిప్పడాలే దీనికి సాక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌.. కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి.. ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డిలను సీబీఐ విచారిస్తేనే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో బండారు మాట్లాడారు. 

Read more