-
-
Home » Andhra Pradesh » Ban on Maoists for another year-NGTS-AndhraPradesh
-
మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం
ABN , First Publish Date - 2022-08-17T08:00:33+05:30 IST
మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం

అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు అనుబంధ సంఘాలపై మరో ఏడాది పాటు నిషేధాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తుపాకీ చేతబట్టి రాజ్యాధికారాన్ని సాధించాలనే మావోయిస్టు పార్టీతోపాటు దాని అనుబంధ సంఘాలపై దేశంలో కొన్నేళ్లుగా నిషేధం కొనసాగుతోంది. అందులో సీపీఐ(మావోయిస్టు), రెవల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్(ఆర్‌డీఎఫ్), రాడికల్ యూత్ లీగ్(ఆర్‌వైఎల్); రైతు కూలీ సంఘం, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్‌ఎ్‌సయూ); సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస), విప్లవ కార్మిక సమాఖ్య(వికాస), ఆలిండియా రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్(ఏఐఆర్‌ఎ్‌సఎ్‌ఫ)ను నిషేధిత జాబితాలో 2023 ఆగస్టు 17వరకూ కొనసాగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.