నూకల ఎగుమతిపై నిషేధం

ABN , First Publish Date - 2022-09-10T09:50:12+05:30 IST

నూకల(విరిగిన బియ్యం) ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

నూకల ఎగుమతిపై నిషేధం

ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు

అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి), న్యూఢిల్లీ: నూకల(విరిగిన బియ్యం) ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అదేవిధంగా బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎక్సైజ్‌ సుంకాన్ని విధించింది. అయితే, పారాబాయిల్డ్‌ బియ్యం ఎగుమతులపై మాత్రం నిషేధం, ఎక్సైజ్‌ సుంకాలు వర్తించవని పేర్కొంది. ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సాగు కోటి నుంచి కోటీ 20 లక్షల టన్నుల వరకు తగ్గుతుందని అంచనా వేసిన నేపథ్యంలో దేశీయంగా బియ్యం ధరలు పెరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే మీడియాకు తెలిపారు. తాజా ఆదేశాలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయన్నారు. 

Updated Date - 2022-09-10T09:50:12+05:30 IST