మాజీ మంత్రి బాలినేనికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2022-07-14T04:27:07+05:30 IST

మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasreddy) కరోనా పాజిటివ్ (Corona Positive) నిర్ధారణ అయింది. .

మాజీ మంత్రి బాలినేనికి కరోనా పాజిటివ్

ప్రకాశం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasreddy)కి కరోనా పాజిటివ్ (Corona Positive) నిర్ధారణ అయింది. రెండు రోజులుగా ఆయన జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. తాజాగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో కరోనా పాజిటివ్ వచ్చింది.  ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ (Hyderabad)లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తనను కలిసిన వాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. వర్షాల నేపథ్యంలో ఒంగోలు (Ongole) అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. కోలుకున్న తర్వాత యథావిధిగా పార్టీ కార్యక్రమాలకు హాజరవుతానని బాలినేని పేర్కొన్నారు. 

Read more