Atchennaidu: టీడీపీ వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన డీఎస్పీపై చర్యలు తీసుకోవాలి..

ABN , First Publish Date - 2022-08-26T18:00:11+05:30 IST

టీడీపీ వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన డీఎస్పీపై ఏపీ రాష్ట్ర డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని....

Atchennaidu: టీడీపీ వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన డీఎస్పీపై చర్యలు తీసుకోవాలి..

అమరావతి (Amaravathi): టీడీపీ (TDP) వారిపై థర్డ్ డిగ్రీ (Third degree) ప్రయోగించిన డీఎస్పీ (DSP)పై ఏపీ రాష్ట్ర డీజీపీ (DGP) వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchennaidu)ట్విటర్ (Twitter) వేదికగా డిమాండ్ చేశారు. పోలీసు కస్టడీలో ఉన్న టీడీపీ సానుభూతిపరులపై ఇంత దారుణంగా హింసకు తెగబడతారా? అంటూ ప్రశ్నించారు. ‘‘డీజీపీ గారు.. ఇది ఇంకా మీ దృష్టి కి రాలేదా? ఆ డీఎస్పీపై మీరు చర్యలు తీసుకుంటారా? లేదా? ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే. రాజ్యాంగం అనేది ఒకటి ఉంది అని ఏపీలో అధికార పార్టీ ఎప్పుడో మర్చిపోయింది. ఇప్పుడు కొందరు పోలీసు అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారు. అటువంటి అధికారులను సన్మార్గంలో పెట్టవలసిన బాధ్యత మీపైన ఉంది. ఈ ఘటనకు బాధ్యులు అయిన అధికారులపై మీరు వెంటనే చర్య తీసుకోని పక్షంలో దీనిపై ఖచ్చితంగా న్యాయపోరాటం చేస్తాము..’’అని అచ్చెన్నాయుడు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2022-08-26T18:00:11+05:30 IST