-
-
Home » Andhra Pradesh » Atchenna comments-MRGS-AndhraPradesh
-
సీఎం జగన్‌రెడ్డి గుడ్డిలెక్కలు చెప్పారు: అచ్చెన్న
ABN , First Publish Date - 2022-03-16T15:21:58+05:30 IST
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మృతుల పట్ల విచారణ కోరితే పట్టించుకోలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మృతుల పట్ల విచారణ కోరితే పట్టించుకోలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మృతుల విషయమై సీఎం జగన్‌రెడ్డి గుడ్డిలెక్కలు చెప్పారన్నారు. ఏమీ తెలుసుకోకుండానే నాటుసారా కాయలేదనడం సరికాదన్నారు. అధిక మద్యం ధరలతో నాటుసారా తాగి ప్రజలు చనిపోతున్నారని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.