దళితులపై వైఎస్సార్ దాడుల కానుక పథకం అమలవుతోంది: అచ్చెన్న

ABN , First Publish Date - 2022-09-27T17:29:36+05:30 IST

తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్ విజయ్ కుమార్‌పై వైసీపీ గూండాల దాడి హేయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు

దళితులపై వైఎస్సార్ దాడుల కానుక పథకం అమలవుతోంది: అచ్చెన్న

Ananthapuram : తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్ విజయ్ కుమార్‌పై వైసీపీ గూండాల దాడి హేయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు (Atchennaidu) పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. విజయ్ కుమార్‌పై వైసీపీ (YCP)కి చెందిన నలుగురు యువకులు కర్రలతో దాడి చేశారన్నారు. రెండు రోజుల క్రితం ఇదే తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్ (TDP Councellor) మల్లిఖార్జునపై దాడి జరిగిందన్నారు. దళితులపై సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) కక్ష కట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై వైఎస్సార్ దాడుల కానుక పథకం అమలవుతోందన్నారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి (Peddareddy) ఆగడాలకు అంతులేకుండా పోతోందన్నారు. జగన్ రెడ్డిని మించిన నియంతలా పెద్దారెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీడీపీ కౌన్సిలర్లపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Read more