-
-
Home » Andhra Pradesh » Asha worker is raped and murdered when she goes to find her cell phone is lost-NGTS-AndhraPradesh
-
సెల్ ఫోన్ పోయిందని వెళ్తే ఆశా వర్కరుపై అత్యాచారం, హత్య
ABN , First Publish Date - 2022-09-19T09:21:46+05:30 IST
సెల్ ఫోన్ పోయిందని వెళ్తే ఆశా వర్కరుపై అత్యాచారం, హత్య

విజయపురిసౌత్, మాచర్ల, సెప్టెంబరు 18: తన సెల్‌ఫోన్ పోవడంతో వెతకడానికి వెళ్లిన ఓ ఆశా వర్కరుపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలం పెద అనుపు చెంచుకాలనీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు ..కాలనీకి చెందిన ఆశావర్కరు (46) ఈ నెల 17 నుంచి కనిపించకపోవడంతో భర్త, ఆమె తండ్రి వెతుకులాట ప్రారంభించారు. 16వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో వివాహిత తన ఇంటి సమీపానికి వచ్చి సెల్‌ఫోన్ పోయిందని తనకు చెప్పినట్లు అదేగ్రామానికి చెందిన మండ్లి ముత్తయ్య వారికి తెలిపారు. బీకేవీ పాలేనికి చెందిన చావిటి చిన అంజి, శీలం అంజి, బైస్వామి కూలి డబ్బులు కోసం అదే సమయంలో తన ఇంటికి వచ్చారన్నారు. సెల్‌ఫోన్ ఎక్కడుందో బీకేవీపాలేనికి చెందిన వెంకన్న అనే వ్యక్తి కనిపెడతాడని చెప్పడంతో ఆమె వారితో కలిసి వెళ్లిందని ముత్తయ్య చెప్పారు. దీంతో వివాహిత భర్త, లస్కర్, గ్రామస్థులు శనివారం రాత్రి బీకేవీపాలేనికి వెళ్లి వెంకన్నను విచారించారు. ఆమె తన వద్దకు వచ్చిన మాట వాస్తవమేనని, సెల్‌ఫోన్ స్విచ్ఛా్‌ఫలో ఉండడంతో, తర్వాత రోజు వస్తే చూస్తానని చెప్పడంతో ఆమె ఆ ముగ్గురితో కలిసి తిరిగి వెళ్లిందని సమాధానమిచ్చాడు. చావిటి చినఅంజి, శీలం అంజిలను గ్రామస్థులు పట్టుకుని నిలదీయగా.. ముగ్గురం కలిసి అత్యాచారం చేశామని, రాయితో తలపై కొట్టడంతో మృతి చెందిందని చెప్పారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని మాచర్ల ఆస్పత్రికి తరలించగా, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం అక్కడికి వెళ్లారు. నీలావతి కుటుంబసభ్యులు ఆయనకు తమ బాధను చెప్పుకొని కన్నీరుమున్నీరయ్యారు. ఎమ్మెల్యే మృతురాలి కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చెక్కును అందజేశారు.