హైకోర్టులో కేంద్ర న్యాయవాదుల నియామకం

ABN , First Publish Date - 2022-09-11T10:03:57+05:30 IST

ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు 35 మంది న్యాయవాదులను కేంద్ర న్యాయశాఖ నియమించింది.

హైకోర్టులో కేంద్ర న్యాయవాదుల నియామకం

అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు 35 మంది న్యాయవాదులను కేంద్ర న్యాయశాఖ నియమించింది. అలాగే అమరావతి రైల్వే క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌లో వాదనల వినిపించేందుకు మరో ఏడుగురిని నియమించింది. వీరు మూడేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం తరఫున సేవలు అందించనున్నారు. ఈ మేరకు ఈనెల 9న కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

Read more