సర్వే పనుల్లో వేగం పెంచండి

ABN , First Publish Date - 2022-04-24T10:09:38+05:30 IST

‘గడువు సమీపిస్తోంది. మీకిచ్చిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలి. పనుల్లో వేగం పెంచండి’

సర్వే పనుల్లో వేగం పెంచండి

సర్వేఆఫ్‌ ఇండియాను కోరిన ఏపీ సర్వే శాఖ


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘గడువు సమీపిస్తోంది. మీకిచ్చిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలి. పనుల్లో వేగం పెంచండి’ అంటూ సర్వే ఆఫ్‌ఇండియాను రాష్ట్ర సర్కారు కోరింది. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సర్వే ఆఫ్‌ ఇండియాకు కేటాయించిన రెవెన్యూ డివిజన్‌లలో రీ సర్వే పనులను పూర్తిచేసేందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని కోరినట్లు తెలిసింది. శనివారం హైదరాబాద్‌లో సర్వే ఆఫ్‌ఇండియా కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. రాష్ట్ర సర్వేశాఖ కమిషనర్‌ సిద్ధార్థ్‌జైన్‌, ఇతర అధికారులు, జియో స్పేషియ ల్‌ డేటా సెంటర్‌ డైరెక్టర్‌ ఎస్వీ సింగ్‌ పాల్గొన్నారు. ఏపీలో డ్రోన్‌ సర్వే చేపట్టేందుకు సర్వే ఆఫ్‌ ఇండియా సర్కారుతో ఒప్పందం కుదుర్చుకుంది.  

Read more