టీడీపీ సభ్యులది గాలితనం: పేర్ని

ABN , First Publish Date - 2022-03-23T08:45:27+05:30 IST

శాసనసభ, మండలిలో టీడీపీ సభ్యులు గాలితనంగా వ్యవహరిస్తున్నారని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు..

టీడీపీ సభ్యులది గాలితనం: పేర్ని

అమరావతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): శాసనసభ, మండలిలో టీడీపీ సభ్యులు గాలితనంగా వ్యవహరిస్తున్నారని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.  మంగళవారం అమరావతి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ‘ఆకతాయిలుగా కాగితాలు చింపి స్పీకర్‌పై విసరడం, కోడిపందేల బరుల వద్ద ఈలలు వేసినట్లు సభలో ఈలలు వేస్తూ, బయటకొచ్చి, తాము విజిల్స్‌ వేశామంటూ మీడియాకు చెప్పడం కన్నా బరి తెగింపు ఇంకేమైనా ఉంటుందా? ఇంత గాలితనంగా ఉండటం వల్ల గత్యంతరం లేకే టీడీపీ సభ్యులను బయటకు పంపాల్సి వస్తోందన్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుపై చేసిన వ్యాఖ్యలను, చెప్పుతో కొట్టుకున్న ఆయన ప్రవర్తనను ఖండిస్తున్నామన్నారు.  

Read more