తెర దగ్గరికొస్తే మేకులు దిగుతాయ్‌..!

ABN , First Publish Date - 2022-03-23T08:43:15+05:30 IST

అగ్రహీరోల చిత్రాలు విడుదలయ్యాయంటే అభిమానుల సందడి అంతా ఇంతా కాదు! ఇలాగే, విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్‌లో...

తెర దగ్గరికొస్తే మేకులు దిగుతాయ్‌..!

విజయవాడ సిటీలైఫ్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): అగ్రహీరోల చిత్రాలు విడుదలయ్యాయంటే అభిమానుల సందడి అంతా ఇంతా కాదు! ఇలాగే, విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్‌లో ఇటీవల రాధేశ్యామ్‌ చిత్రం విడుదల రోజున అభిమానులు హీరో కనిపించగానే తెరపైనే పాలాభిషేకం చేశారు. దీంతో మరకలు పడి తెర పాడైంది. ఈ తెరను ఇటీవలే రూ.15 లక్షలు పెట్టి ఆధునీకరించారు. ఈ నెల 25న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా మేకులు కొట్టిన చెక్కలను తెర మందు ఉంచి ,అపాయం అని హెచ్చరిక బోర్టులు కూడా ఏర్పాటు చేసింది. అభిమానులు తెరవద్దకు వెళ్లకుండా ఆగడం లేదని అందుకే ఈ ఏర్పాట్లను యాజమాన్యం చెబుతోంది.

Read more