జగన్‌ నాయకత్వం వర్ధిల్లాలంటూ ప్రభుత్వ ఆస్తులపై నినాదాలు

ABN , First Publish Date - 2022-03-23T08:39:11+05:30 IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై నమోదైన ఓ...

జగన్‌ నాయకత్వం వర్ధిల్లాలంటూ ప్రభుత్వ ఆస్తులపై నినాదాలు

 13 ఏళ్లపాటు కోర్టుకు హాజరు 

తిరుపతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై నమోదైన ఓ కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు(విజయవాడ) కొట్టివేసింది. ‘వైఎస్‌ జగన్‌ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ ప్రభుత్వ ఆస్తులపై నినాదాలు రాశారనే అభియోగంతో 2009లో చెవిరెడ్డిపై రేణిగుంట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి 13 ఏళ్లపాటు ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ విచారణకు చెవిరెడ్డి క్రమం తప్పకుండా హాజరయ్యారు. ఆయన తరఫున న్యాయవాదులు పి. సురేశ్‌బాబు, సీబీ మధుకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా, మంగళవారం జరిగిన విచారణలో ప్రత్యేక కోర్టు ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. మరోవైపు, కడప, రాజంపేట, రైల్వేకోడూరు తదితర ప్రాంతాల్లో మరికొందరిపై నమోదైన ఇదే తరహా కేసుల విచారణ కొనసాగుతోంది. 

Updated Date - 2022-03-23T08:39:11+05:30 IST