ఇంత మోసం చేస్తారా?

ABN , First Publish Date - 2022-03-23T08:36:33+05:30 IST

‘అప్పుడేమో ఇల్లు కట్టిస్తామన్నారు. ఇప్పుడేమో పట్టా రద్దు చేస్తామంటున్నారు. ఇంత మోసం చేస్తారా?..

ఇంత మోసం చేస్తారా?

 అప్పుడు ఇల్లు కట్టిస్తామని ఇప్పుడు రద్దు చేస్తామంటారా?

 జగనన్న కాలనీ లబ్ధిదారుల ఆగ్రహం  

పత్తికొండ టౌన్‌, మార్చి 22: ‘అప్పుడేమో ఇల్లు కట్టిస్తామన్నారు. ఇప్పుడేమో పట్టా రద్దు చేస్తామంటున్నారు. ఇంత మోసం చేస్తారా?’ అని జగన న్న కాలనీ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ లో సచివాలయం ఎదుట మహిళలు మంగళవారం ఆందోళనకు దిగారు. పట్టణంలో 6వ సచివాయం పరిధిలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం జగనన్న కాలనీ కింద ఇంటి స్థలాలు మంజూరు చేసింది. ఆదోని రోడ్డులోని కాశీరెడ్డినాయన వెనుక భాగాన ఉన్న సర్వే నం.150 ప్రభుత్వ భూమిలో 120 మందికి వరకూ స్థలాలను కేటాయించింది. అయితే అక్కడ లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు రాలేదు. హౌసింగ్‌, సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ఆదేశాలతో పట్టాలు తీసుకుని మహిళలు పెద్దఎత్తున సచివాలయానికి చేరుకున్నారు. సకాలంలో ఇళ్లు కట్టకపోతే పట్టాలు రద్దుచేస్తామని హౌసింగ్‌, సచివాలయ అధికారులు తేల్చి చెప్పడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంకలు, వాగుల్లో స్థలాలు చూపిస్తే ఇళ్లు ఎలా కట్టుకోవాలని మండిపడ్డారు.

Read more