మాక్‌ పార్లమెంట్‌లో మళ్లీ ‘దిశ’

ABN , First Publish Date - 2022-03-05T08:11:53+05:30 IST

మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏపీ మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా ‘జాతీయ మహిళా..

మాక్‌ పార్లమెంట్‌లో మళ్లీ ‘దిశ’

 చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు!!

 అట్టహాసంగా సమావేశాలు.. తీర్మానాలు

గుంటూరు, మార్చి 4: మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏపీ మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా ‘జాతీయ మహిళా పార్లమెంట్‌-2022’ శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పార్లమెంట్‌ స్పీకర్‌గా వ్యవహరించిన ‘మాక్‌ పార్లమెంట్‌’ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. చట్టసభల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని మహిళా పార్లమెంట్‌లో తీర్మానం చేసి ఆమోదించారు. అలానే రాష్ట్రప్రభుత్వం రూపొందించి, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న దిశ చట్టం బిల్లును ఆమోదించారు. మహిళలకు వివాహ వయస్సు పరిమితి 21 ఏళ్లు సబబేనంటూ సమావేశం వేదికగా ఆమోదించారు. మరో ఐదు అంశాలపై చర్చించారు. కమిషన్‌ సభ్యులు కేంద్ర మంత్రులుగా వ్యవహరించారు. సమావేశానికి ప్రజాప్రతినిధులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు మహిళా అధికారులు, కళాశాలల విద్యార్థినులు హాజరయ్యారు. అంతకుముందు ఈ కార్యక్రమాన్ని హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి(తాడికొండ), ఎమ్మెల్సీలు పోతుల సునీత, కల్పలత, వర్సిటీ వీసీ రాజశేఖర్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ  మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించాలని ఆకాంక్షించారు. 

Updated Date - 2022-03-05T08:11:53+05:30 IST