నోటిఫికేషన్‌ లేకుండానే వక్ఫ్‌బోర్డు

ABN , First Publish Date - 2022-02-19T09:34:20+05:30 IST

వక్ఫ్‌ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వక్ఫ్‌ బోర్డు పరిపాలనలో చోటుచేసుకున్న ..

నోటిఫికేషన్‌ లేకుండానే వక్ఫ్‌బోర్డు

 అక్రమాలపై సీబీఐ విచారణ జరపండి... హైకోర్టులో పిల్‌ 

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వక్ఫ్‌ బోర్డు పరిపాలనలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని విజయవాడకు చెందిన అబ్దుల్‌ ఖాదర్‌ మహ్మద్‌ ఈ పిల్‌లో అభ్యర్ధించారు. వక్ఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 14 ప్రకారం సభ్యుల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలన్నారు. ఎలాంటి నోటిఫికేషన్‌ లేకుండా నామినేషన్‌ విధానంలో పలువురు సభ్యులను నియమించారన్నారు. ముస్లిం ఎంపీ, ఎమ్మెల్యేలు బోర్డు సభ్యులుగా ఉండాలన్నారు. ప్రస్తుత బోర్డు సభ్యులకు అర్హతలు లేవన్నారు. సభ్యుల నియామకాన్ని రద్దు చేయాలని కోరారు. 

Read more