విమ్స్‌’లో కొవిడ్‌ ముక్కు టీకా ట్రయల్స్‌

ABN , First Publish Date - 2022-02-19T09:13:04+05:30 IST

కొవిడ్‌పై పోరులో భాగంగా ముక్కు నుంచి తీసుకునే టీకాను భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారు చేసింది. మొదటి, రెండో దశ ...

విమ్స్‌’లో కొవిడ్‌ ముక్కు టీకా ట్రయల్స్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌పై పోరులో భాగంగా ముక్కు నుంచి తీసుకునే టీకాను భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారు చేసింది. మొదటి, రెండో దశ ట్రయల్స్‌ ఇప్పటికే పూర్తవగా మూడో విడత ట్రయల్స్‌ నిర్వహణకు దేశంలోని పలు సెంటర్లను తాజాగా ఎంపిక చేశారు. ఇందులో రాష్ట్రం నుంచి విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(విమ్స్‌) ఉంది. ట్రయల్స్‌ నిర్వహించేందుకు ఆస్పత్రి ఎథిక్స్‌ కమిటీ శుక్రవారం అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా మూడోదశ ట్రయల్స్‌ను 3,160 మందిపై నిర్వహిస్తుండగా, విశాఖలో 50 మంది వలంటీర్లను దీనికోసం ఎంపిక చేయనున్నారు. 

Read more