-
-
Home » Andhra Pradesh » ap-NGTS-AndhraPradesh
-
కొత్తగా 495 కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-02-19T09:12:45+05:30 IST
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 22,383 శాంపిల్స్‌ను పరీక్షించగా...

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 22,383 శాంపిల్స్‌ను పరీక్షించగా 495 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 23,15,525కి పెరిగింది. కరోనాతో చిత్తూరులో ఒకరు చనిపోవడంతో మొత్తం మరణాలు 14,708కి చేరుకున్నాయి. కాగా, అమరావతి సచివాలయంలో కొవిడ్ ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్‌శర్మ అన్ని శాఖలకు ఆదేశాలు జారీచేశారు.