తాడేపల్లి సమీపంలో 70 కోట్లతో గోకుల క్షేత్రం

ABN , First Publish Date - 2022-02-19T09:02:17+05:30 IST

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కొలనుకొండ వద్ద ఆరున్నర ఎకరాల స్థలంలో ఇస్కాన్‌ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా...

తాడేపల్లి సమీపంలో 70 కోట్లతో గోకుల క్షేత్రం

మంగళగిరి, ఫిబ్రవరి 18: గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కొలనుకొండ వద్ద ఆరున్నర ఎకరాల స్థలంలో ఇస్కాన్‌ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా రూ.70 కోట్లతో నిర్మిస్తున్న గోకుల క్షేత్రానికి జగన్‌ భూమిపూజ నిర్వహించారు. ప్రస్తుతం నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలను చేపడుతున్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, రాధాకృష్ణుల ఆలయాలను సుందరంగా నిర్మించనున్నారు. వీటితో పాటు సంప్రాదాయ నృత్యాలను ప్రదర్శించేందుకు కళాక్షేత్రాలు, యువతకు శిక్షణా కేంద్రాలు, యోగ ధ్యాన కేంద్రాలను నిర్మించనున్నారు. ఇస్కాన్‌ సంస్థ రాష్ట్రంలో చేపడుతున్న భారీ ఆధ్యాత్మిక కేంద్రమిదే. 

Read more