చేతులెత్తి మొక్కుతాం.. విలీనం చేయొద్దు

ABN , First Publish Date - 2022-02-16T07:41:28+05:30 IST

‘మీకు చేతులెత్తి మొక్కుతాం.. మా పాఠశాలను హైస్కూల్‌లో విలీనం చేయవద్దు’ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కళింగగూడెం ఎంపీయూపీ స్కూల్‌...

చేతులెత్తి మొక్కుతాం.. విలీనం చేయొద్దు

 పశ్చిమలో విద్యార్థుల వేడుకోలు

ఆకివీడు రూరల్‌ ఫిబ్రవరి 15: ‘మీకు చేతులెత్తి మొక్కుతాం.. మా పాఠశాలను హైస్కూల్‌లో విలీనం చేయవద్దు’ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కళింగగూడెం ఎంపీయూపీ స్కూల్‌ విద్యార్థులు దండం పెడుతూ మంగళవారం వినూత్నరీతిలో నిరసన తెలిపారు. నూతన విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాలను మూడు కిలోమీటర్ల దూరంలోని జడ్పీ హైస్కూల్‌లో విలీనం చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో సర్పంచ్‌ గురువెల్లి అన్నపూర్ణ, ఎంపీటీసీ బొడ్డుపల్లి రోహిణి, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఈ నిరసన తెలిపారు.

Read more