త్వరలోనే ‘అల్లూరి’ పనులు

ABN , First Publish Date - 2022-02-16T07:35:07+05:30 IST

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక ప్రదేశాలు శిథిలావస్థకు చేరుకొన్నాయంటూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం అధికార...

త్వరలోనే ‘అల్లూరి’ పనులు

 ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఏపీటీడీసీ ఈఈ వివరణ

కృష్ణాదేవిపేట(విశాఖపట్నం జిల్లా), ఫిబ్రవరి 15: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక ప్రదేశాలు శిథిలావస్థకు చేరుకొన్నాయంటూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం అధికార యంత్రాంగాన్ని కదిలించింది. అల్లూరి తిరుగాడిన ఈ ప్రదేశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ఈఈ రమణ మంగళవారం పేర్కొన్నారు. ‘‘కృష్ణాదేవిపేటలోని అల్లూరి పార్కులో రూ.50 లక్షలతో ఓపెన్‌ ఆడిటోరియం, క్యాంటీన్‌, కియోస్క్‌ ఏర్పాటుకు గత నెల టెండర్లు పిలిచాం. త్వరలో పనులు ప్రారంభమవుతాయి’’ అని తెలిపారు. అయితే, వేతన బకాయిలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయాలను సంబంధిత అధికారులకు నివేదించామని పేర్కొన్నారు. 

Read more