-
-
Home » Andhra Pradesh » APCC President Sake Shailajanath-NGTS-AndhraPradesh
-
ఖనిజ సంపద కొల్లగొట్టడానికే రోడ్లు: శైలజానాథ్
ABN , First Publish Date - 2022-08-31T09:07:50+05:30 IST
ఏజెన్సీ ప్రాంతంలో నిక్షిప్తమైన ఖనిజ సంపదను కొల్లగొట్టడానికే కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులను నిర్మిస్తున్నదని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలాజానాథ్ ఆరోపించారు. మంగళవారం ఆయన అల్లూరి

డుంబ్రిగుడ/అరకులోయ, ఆగస్టు 30: ఏజెన్సీ ప్రాంతంలో నిక్షిప్తమైన ఖనిజ సంపదను కొల్లగొట్టడానికే కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులను నిర్మిస్తున్నదని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలాజానాథ్ ఆరోపించారు. మంగళవారం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో పర్యటించారు. అధ్యాపకులను నియమించాలని కోరుతూ అరకులోయ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడం మానేసి ఖనిజ సంపదపై కన్నేశాయని ఆరోపించారు. గిరిజనుల చట్టాలు, హక్కుల పరిరక్షణకు పోరాడతామని అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఏజెన్సీలోని ఏకైక మహిళా డిగ్రీ కళాశాలకు అధ్యాపకులు, సిబ్బందిని నియమించపోకపోతే ఎలాగని ప్రశ్నించారు.