గడప గడపకు ప్రభుత్వం పేరుతో మరో మోసం: Sailajanth

ABN , First Publish Date - 2022-05-21T18:49:53+05:30 IST

గడప గడపకు ప్రభుత్వం పేరుతో వైసీపీ సర్కార్ మరో మోసానికి పాల్పడుతోందని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ అన్నారు.

గడప గడపకు ప్రభుత్వం పేరుతో మరో మోసం: Sailajanth

అమరావతి: గడప గడపకు ప్రభుత్వం పేరుతో వైసీపీ సర్కార్ మరో మోసానికి పాల్పడుతోందని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... బస్సుయాత్ర ద్వారా ప్రజలకు ఏం అభివృద్ధి చేసారని చెబుతారని ప్రశ్నించారు. దావోస్ సదస్సు పేరుతో ప్రజాధనం వృధా అంటూ మండిపడ్డారు. దావోస్ పర్యటన అని చెప్పి లండన్ పర్యటన ఆంతర్యం ఏమిటి అని నిలదీశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ద్రోహం, ధగా చేస్తోందని విమర్శించారు. పేరుకు పదవులు ఇచ్చి, వారికి పవర్ లేకుండా రబ్బరు స్టాంపులుగా మార్చిందని అన్నారు. దావోస్‌కని చెప్పి లండన్ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన పర్యటన వివరాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ స్వంత విహారయాత్రల కోసం వెళుతూ ప్రజా ధనాన్ని జగన్ రెడ్డి వృధా చేస్తున్నారని శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read more