సిగ్గు సిగ్గు.. గంజాయి సరఫరాలో దేశంలోనే మొదటి స్థానంలో AP

ABN , First Publish Date - 2022-09-29T16:16:49+05:30 IST

దేశంలోనే గంజాయి సరఫరా (Supply of cannabis)లో ఏపీ (AP) మొదటి స్థానంలో ఉంది.

సిగ్గు సిగ్గు.. గంజాయి సరఫరాలో దేశంలోనే మొదటి స్థానంలో AP

Amaravathi : దేశంలోనే గంజాయి సరఫరా (Supply of cannabis)లో ఏపీ (AP) మొదటి స్థానంలో ఉంది. తాజాగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (Bureau of Narcotic Control) 2021 నివేదికను విడుదల చేసింది. గత ఏడాది మాదకద్రవ్యాల (Drugs)పై ఎన్సీబీ (NCB) నివేదికను వెలువరించింది. దేశ వ్యాప్తంగా ఏడు లక్షల కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) నుంచి 26% గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే రెండు లక్షల కిలోలకు పైగా గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక గంజాయి సరఫరాలో రెండో స్థానంలో ఒడిస్సా (Odissa) ఉంది. 50 శాతానికి పైగ ఆంధ్ర, ఒడిస్సా రాష్ట్రాల నుంచే గంజాయి సాగవుతోంది. గత ఏడాది ఏపీలో 18 కిలోల హాశిష్ ఆయిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరాపై 1775 కేసులు నమోదయ్యాయి. ఏపీలో గంజాయిని తరలిస్తూ పట్టుబడిన 4202 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హెరాయిన్ కేసు (Heroin Case)ల్లో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 7618 కిలోల హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు. అత్యధికంగా గుజరాత్‌లో 3334 కిలోల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ కేసుల్లో రెండో స్థానంలో యూపీ (Uttar Pradesh) ఉంది. యూపీలో 1337 కిలోల హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు. గత ఏడాది తెలంగాణ (Telangana)లో 35270 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్సీబీ నివేదిక (NCB Report) ప్రకారం అత్యధిక మత్తుపదార్థాల ప్రభావం పంజాబ్‌ (Punjab)లో ఉన్నట్టు తేలింది. 

Read more