పిడుగుపాటు.. మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం

ABN , First Publish Date - 2022-10-06T04:22:12+05:30 IST

ఏపీలో పలుచోట్ల కురిసిన వర్షం విషాదాన్ని నింపాయి. వర్షం పడుతుందని తెలియక పొలాలకు వెళ్లి రైతులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఒక్కసారిగా కురిసిన వర్షం మూడు కుటుంబాల్లో...

పిడుగుపాటు.. మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం

అమరావతి: ఏపీలో పలుచోట్ల కురిసిన వర్షాలు విషాదాన్ని నింపాయి. రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల పడటం లేదు. అయితే వెదర్ సమాచారం తెలియక పొలాలకు వెళ్లిను ముగ్గురు రైతులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వర్షంతో పాటు ఒక్కసారిగా విరుచుకుపడిన పిడుగులు మూడు కుటుంబాల్లో కన్నీళ్లు మిగిల్చాయి. పొద్దున్నే లేచి పొలానికి వెళ్లిన రైతులు ఎంతకీ తిరిగిరాలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులకు పోలాల వద్దకు వెళ్లి చేస్తే విగతజీవులుగా పడి తమవాళ్లు కనిపించారు. దీంతో బోరున విలపించారు. ఈ సంఘటనలు వేరు వేరు చోట్ల.. వేర్వేరు రైతు కుటుంబాల్లో చోటు చేసుకున్నాయి. 


గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చమళ్లముడికు చెందిన ఎలమంద(50) పిడుగుపాటు గురై మృతి చెందారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో పొలంలో పనిచేస్తుండగా పిడుగుపడింది. దీంతో రైతు చంద్రశేఖర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బయ్యవరంలో రైతు ఆంజనేయులు కూడా పిడుగుపాటు వల్ల మృతి చెందారు. ఇలా ఒకే రోజు అన్నదాతలు చనిపోవడంతో వారి స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 


Updated Date - 2022-10-06T04:22:12+05:30 IST