నోషనల్‌ ఇంక్రిమెంట్లకు వివరాలు పంపాలి: జేడీ

ABN , First Publish Date - 2022-05-18T10:10:35+05:30 IST

సెకండరీ స్కూల్‌ టీచర్లుగా 1997, 1998 డీఎస్సీలలోను, స్కూల్‌ అసిస్టెంట్లుగా..

నోషనల్‌ ఇంక్రిమెంట్లకు వివరాలు పంపాలి: జేడీ

అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): సెకండరీ స్కూల్‌ టీచర్లుగా 1997, 1998 డీఎస్సీలలోను, స్కూల్‌ అసిస్టెంట్లుగా 1997, 1998, 2000, 2001 డీఎస్సీల్లోను ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న అన్‌ట్రెయిన్డ్‌ ఎస్టీ ఉపాధ్యాయులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు అవసరమైన వివరాలు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. అన్ని జిల్లాల్లోని డీఈవోలు ఈ కేటగిరిలో ఉన్న ఎస్టీ ఉపాధ్యాయుల వివరాలు పంపించాలని విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మువ్వా రామలింగం మంగళవారం ఒక మెమో విడుదల చేశారు. ఇలా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.

Read more