శ్లాబులు మార్చి భారం మోపొద్దు: తులసీదాస్‌ విజ్ఞప్తి

ABN , First Publish Date - 2022-01-28T09:46:25+05:30 IST

శ్లాబులు మార్చి భారం మోపొద్దు: తులసీదాస్‌ విజ్ఞప్తి

శ్లాబులు మార్చి భారం మోపొద్దు: తులసీదాస్‌ విజ్ఞప్తి

అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ‘‘శ్లాబులు మార్చేసి ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం వేయొద్దు. చార్జీలను పెంచే ప్రతిపాదనలను యథాతథంగా ఆమోదించవద్దు. చిరువ్యాపారులు, పేద కుటుంబాలకు వెసులుబాటు కలిగేలా చార్జీలను వసూలు చేసేలా విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్‌)లను ఆదేశించండి’’ అని రైతు సంఘం మాజీ అధ్యక్షుడు బి.తులసీదాస్‌ ఏపీఈఆర్‌సీకి విజ్ఞప్తి చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన మాట్లాడుతూ 1996-97లో అమలు చేసిన ప్రపంచబ్యాంకు విధానాలనే నీతిఆయోగ్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్లతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై రుద్దుతోందని ఆరోపించారు. వీటివల్ల డిస్కమ్‌లపై అప్పుల భారం పెరుగుతుందని చెప్పారు. పంపిణీరంగ సంస్థల్లోకి ప్రైవేటు వ్యక్తులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీరు, వీధి దీపాలకూ ప్రీపెయిడ్‌ మీటర్లు ఏర్పాటు చేస్తే కొత్త సమస్యలు వస్తాయని వివరించారు.

Read more