జనసేన, టీడీపీ సభ్యులు ఒక్కటయ్యారు... వైసీపీ సభ్యుల హేళన

ABN , First Publish Date - 2022-09-24T22:42:45+05:30 IST

జనసేన, టీడీపీ సభ్యులు ఒక్కటయ్యారు... వైసీపీ సభ్యుల హేళన

జనసేన, టీడీపీ సభ్యులు ఒక్కటయ్యారు... వైసీపీ సభ్యుల హేళన

ఏలూరు: జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై భేటీలో టీడీపీ జడ్పీటీసీ సురేష్‌బాబు ప్రస్తావించారు. టీడీపీ సభ్యునిపై వైసీపీ సభ్యుల ఏకధాటిగా మాటల దాడికి దిగారు. జడ్పీటీసీ సభ్యులకు అందరికీ రూమ్స్ కేటాయించి ప్రతిపక్ష సభ్యులకు రూమ్ కేటాయించకపోవడం అన్యాయమని సురేష్‌బాబు ఆరోపించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నిధులు మంజూరు కాకుండా అధికారులను బెదిరిస్తున్నారని జనసేన జడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు ఆరోపించారు. జయప్రకాష్ నాయుడు నుంచి  వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు  మైక్ లాక్కున్నారు. జనసేన, టీడీపీ సభ్యులు ఒక్కటయ్యారంటూ వైసీపీ సభ్యుల హేళన చేశారు. వాగ్వాదం ముదురుతుండడంతో జడ్పీ చైర్మన్ శ్రీనివాస్ భోజన విరామం ప్రకటించారు. 

Read more