గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీలో విభేదాలు

ABN , First Publish Date - 2022-07-23T20:43:01+05:30 IST

నగర తూర్పు నియోజకవర్గం వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. నెహ్రూ‌నగర్‌లో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభంలో ఎమ్మెల్యే అసహానం వ్యక్తం చేశారు.

గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీలో విభేదాలు

గుంటూరు: నగర తూర్పు నియోజకవర్గం వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. నెహ్రూ‌నగర్‌లో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభంలో ఎమ్మెల్యే అసహానం వ్యక్తం చేశారు. నగర డిప్యూటీ మేయర్ పట్ల ఎమ్మెల్యే అగౌరవంగా ప్రవర్తంచినట్లు తెలిసింది. తనకు పోటీగా వస్తున్నావని డిప్యూటీ మేయర్ సజీలాపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. తనను కాదని ముందుకు ఎలా వస్తావని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కాదని నియోజకవర్గంలో ఏం చేయాలేవని హెచ్చరించారు. ఎమ్మెల్యే ముస్తఫా తీరుతో అధికారులు , ప్రజా ప్రతినిధులు విస్తుపోయారు. అలాగే ఎమ్మెల్యే తీరు పట్ల డిప్యూటీ మేయర్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read more