వియవాడ... పాతబస్తీ కంసాలిపేటలో విషాదం

ABN , First Publish Date - 2022-08-06T23:20:32+05:30 IST

వియవాడ... పాతబస్తీ కంసాలిపేటలో విషాదం

వియవాడ... పాతబస్తీ కంసాలిపేటలో విషాదం

విజయవాడ: నగరంలోని పాతబస్తీ కంసాలిపేటలో విషాదఘటన చోటుచేసుకుంది. పార్కింగ్ చేసిన కారును డ్రైవ్ చేసేందుకు మైనర్ ప్రయత్నించాడు. మైనర్ ప్రయత్నంతో ఒక్కసారిగా కారు ముందుకు దూసుకువెళ్లింది. రోడ్డుపై ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులను ఆ కారు ఢీకొట్టింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు బాలురకు తీవ్రగాయాలయ్యాయి. కేసునమోదు చేసిన కొత్తపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు షఫీ.. తల్లి కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తోందన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికుల డిమాండ్ చేశారు. 

Read more