-
-
Home » Andhra Pradesh » ap news vangalapudi anitha chsh-MRGS-AndhraPradesh
-
నిందితుల్లో వాలంటీర్లు, వైసీపీ నేతలే వున్నారు: అనిత
ABN , First Publish Date - 2022-10-06T23:51:51+05:30 IST
నిందితుల్లో వాలంటీర్లు, వైసీపీ నేతలే వున్నారు: అనిత

అమరావతి: మహిళా కమిషన్ను రాజకీయ ప్రయోజనాలు, విమర్శల కోసం చైర్పర్సన్ వాడుకుంటున్నారని టీడీపీ నేత వంగలపూడి అనిత అన్నారు. మహిళలను వేధించేవారిపై పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. వాలంటీర్, ప్రజాప్రతినిధి అయినా శిక్షించాల్సిందేనని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపుగా 40 వరకు అఘాయిత్యాలు జరిగాయన్నారు. నిందితుల్లో వాలంటీర్లు, వైసీపీ నేతలు ఉన్నారని ఆమె ఆరోపించింది.