శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతల పేర్లతో వసూళ్లు

ABN , First Publish Date - 2022-11-30T21:03:03+05:30 IST

జిల్లాలో కీలక నేతల పేర్లతో మోసగాళ్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతల పేర్లతో వసూళ్లు

శ్రీకాకుళం: జిల్లాలో కీలక నేతల పేర్లతో మోసగాళ్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోస్టింగ్ ఇచ్చిన ఐదు నెలల తరువాత ఉద్యోగాల నుంచి తొలగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. వేరే కేసులో వాయిదాకి వచ్చిన రితేష్నాయుడిని బాధితులు పట్టుకున్నారు. శ్రీకాకుళం టూటౌన్ పీఎస్కి రితేష్నాయుడిని తీసుకొచ్చారు. కేసునమోదు చేయాలని కోరుతున్నా.. మరో స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయాలంటుని పోలీసులు చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. అధికార పార్టీ నేతలు ఒత్తిడి వల్లే కేసు నమోదు చేయడంలేదంటూ.. బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-11-30T21:03:03+05:30 IST

Read more