‘ప్రజలను సీఎం తప్పుదారి పట్టిస్తున్నారు’

ABN , First Publish Date - 2022-10-03T00:54:05+05:30 IST

‘ప్రజలను సీఎం తప్పుదారి పట్టిస్తున్నారు’

‘ప్రజలను సీఎం తప్పుదారి  పట్టిస్తున్నారు’

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని రాష్ట్ర  బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు.  ఏపీ రాజధాని అమరావతిని చంపే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.  కుటుంబ పాలన సాగించేవారు... రెచ్చగొట్టుకుంటూ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం  చేశారు. విజయవాడలో మూడు ఫ్లైఓవర్ నిర్మాణం బీజేపీ వల్లే సాకారమైందన్నారు.  అబద్దాలు ప్రచారం చేస్తూ సీఎం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో నరహంతకు పాలన కొనసాగుతోందన్నారు.  రాష్ట్రంలో అరాచక పాలన తప్ప... అభివృద్ధి ఎక్కడైనా ఉందా?, ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేయిస్తారా? అని  సోమువీర్రాజు ప్రశ్నించారు.  

Read more