భారీ వర్షాలు పడే అవకాశం: విపత్తుల సంస్థ

ABN , First Publish Date - 2022-09-08T21:08:44+05:30 IST

భారీ వర్షాలు పడే అవకాశం: విపత్తుల సంస్థ

భారీ వర్షాలు పడే అవకాశం: విపత్తుల సంస్థ

విజయవాడ: తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల సంస్థ పేర్కొంది. రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా దగ్గర అల్పపీడనం బలపడనున్నట్లు వెల్లడించారు. ఏపీలో ఎల్లుండి వరకు విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ పేర్కొంది.కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీవర్షాలు పడే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. 

Read more