-
-
Home » Andhra Pradesh » ap news prakasham andhrapradesh chsh-MRGS-AndhraPradesh
-
దారుణం... వృద్ధుడు పెదన్నపై కత్తితో దాడి
ABN , First Publish Date - 2022-08-31T20:58:01+05:30 IST
దారుణం... వృద్ధుడు పెదన్నపై కత్తితో దాడి

ప్రకాశం: జిల్లాలోని కనిగిరి మండలం చల్లగిరగలలో దారుణఘటన చోటుచేసుకుంది. వినాయక మండలం ఏర్పాటు విషయంలో వివాదం చోటుచేసుకుంది. మండపాన్ని పక్కకు ఏర్పాటు చేయాలన్న వృద్ధుడిపై దాడికి పాల్పడ్డారు. ఆగ్రహంతో వృద్ధుడు పెదన్నపై యువకుడు కత్తితో దాడి చేశాడు. పెద్దన్న పరిస్థితి విషమంగా ఉంది. ఆయన్ను ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచాచరణ జరుపుతున్నారు.