సమస్యలను జనసేన దృష్టికి తీసుకొస్తున్నారు: పవన్

ABN , First Publish Date - 2022-07-18T00:52:50+05:30 IST

ఏపీలో బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరుకున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. వాటికి ప్రభుత్వం మరమ్మతులు చేపట్టాలని సూచించారు.

సమస్యలను జనసేన దృష్టికి తీసుకొస్తున్నారు: పవన్

అమరావతి: ఏపీలో బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరుకున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. వాటికి ప్రభుత్వం మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఇంకా బ్రిటీష్‌కాలంలో కట్టిన వంతెనలే మనకు ఆధారమని చెప్పారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. సమస్యలపై ప్రశ్నిస్తే ఎస్సీలపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలపై దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. అన్ని వర్గాలకు చెందినవారు తమ సమస్యలను జనసేన దృష్టికి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి రాగానే నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. 

Read more