ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హంగామా

ABN , First Publish Date - 2022-11-16T16:28:38+05:30 IST

జిల్లాలోని ఉదయగిరిలో 3 రాజధానుల పేరుతో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హంగామా సృష్టించారు.

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హంగామా

నెల్లూరు: జిల్లాలోని ఉదయగిరిలో 3 రాజధానుల పేరుతో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హంగామా సృష్టించారు. భారీ ర్యాలీ, బహిరంగ సభలకి జనాలు రాకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీ విద్యార్ధులతో వైసీపీ జెండాలు మోయించడంపై విమర్శలు వస్తోన్నాయి. అలాగే సభా వేదికపై జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు గాజుల తాజుద్దీన్‌కి అవమానం ఎదురయింది. వేదికపై నుంచి ఆయన్ను ఎమ్మెల్యే కిందకి పంపంపించారు. దీంతో మరోసారి వైసీపీ వర్గ విభేదాలు వెలుగులోకి వచ్చాయి.

Updated Date - 2022-11-16T16:28:38+05:30 IST

Read more