ఘోర ప్రమాదం... ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2022-11-30T18:51:10+05:30 IST

జిల్లాలోని కోడుమూరు దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా కల్వర్టును కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు.

ఘోర ప్రమాదం... ముగ్గురు మృతి

కర్నూలు: జిల్లాలోని కోడుమూరు దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా కల్వర్టును కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు నంద్యాల జిల్లాకు చెందిన ఎల్లంరాజు, వెంకటస్వామి, నారాయణగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్త ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2022-11-30T18:51:17+05:30 IST

Read more