మోడీ, జగన్ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2022-08-06T21:46:23+05:30 IST

మోడీ, జగన్ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి: తులసిరెడ్డి

మోడీ, జగన్ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి: తులసిరెడ్డి

అమరావతి:  ముఖ్యమంత్రి జగన్ ప్రగతి నిరోధకుడుగా మారారని కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయాల్సిన రూ.1798 కోట్లు విడుదల చేయలేదన్నారు. రాష్ట్రంలో రూ.1.33 లక్షల కోట్లు విలువచేసే కేంద్ర ప్రాజెక్టులు ఆగిపోవడం దురదృష్టకరమన్నారు. అలాగే హాస్టళ్లలో 5 సంత్సరాలుగా మెస్ చార్జీలు పెంచలేదన్నారు. వంట గ్యాస్, కంది పప్పు, నూనెలు తదితర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంకా 903121 మంది అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 3039 కోట్లు చెల్లించాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూదొందేనని ఆయన విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల పెంపు, నిరుద్యోగ సమస్యను పెంచారని తులసిరెడ్డి మండిపడ్డారు. భారాలు మోపడంలో మోడీ, జగన్ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. 

Read more