జై ఆంధ్ర డెమోక్రాటిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

ABN , First Publish Date - 2022-07-23T21:12:22+05:30 IST

జై ఆంధ్ర డెమోక్రాటిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీలో ఆర్ధిక సంక్షోభం, కారణాలు పరిష్కారాలు అంశంపై చర్చించారు.

జై ఆంధ్ర డెమోక్రాటిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

విజయవాడ: జై ఆంధ్ర డెమోక్రాటిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీలో ఆర్ధిక సంక్షోభం, కారణాలు పరిష్కారాలు అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడారు. విభజన అనంతరం చట్టంలో పేర్కొన్న అనేక అంశాలను నేటికి అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడ రేవులు, ఉక్కు కర్మాగారం, పోలవరం., రాజధాని నిర్మాణాలు వలన మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం చట్టంలోని అంశాలను విస్మరించిందని మండిపడ్డారు. విభజన హామీలను అమలు చేయాలని గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తా అన్న జగన్ .. కనీసం అడగడం మానేశారని మండిపడ్డారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ఇస్తామని చట్టంలో ఉన్నా.. అమలు చేయడం లేదన్నారు. 

Updated Date - 2022-07-23T21:12:22+05:30 IST