-
-
Home » Andhra Pradesh » ap news chsh-NGTS-AndhraPradesh
-
గెస్ట్ లెక్చరర్లను కాంట్రాక్టు విధానంలోకి మార్చాలి: ఒంటేరు
ABN , First Publish Date - 2022-09-30T10:01:36+05:30 IST
గెస్ట్ లెక్చరర్లను కాంట్రాక్టు విధానంలోకి మార్చాలి: ఒంటేరు

అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ జూనియర్, డిగ్రీ కళాశాలలు, గురుకులాల్లో పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్లు, ఔట్‌సోర్సింగ్ టీచర్లు, పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లను కాంట్రాక్టు విధానంలోకి మార్చాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్లను ఈ విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడంపై గురువారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.