పంట నష్టం ఒక్క రూపాయైునా ఇచ్చారా..!

ABN , First Publish Date - 2022-09-30T09:54:54+05:30 IST

పంట నష్టం ఒక్క రూపాయైునా ఇచ్చారా..!

పంట నష్టం ఒక్క రూపాయైునా ఇచ్చారా..!

గడప గడపలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని నిలదీసిన మహిళా రైతు


రాయచోటి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘‘మా కుటుంబంలో రెండు పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయి. మేం సాగు చేసిన వరి పంట మొత్తం వర్షానికి కొట్టుకుపోయింది. కానీ.. ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద మాకు కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు’’ అని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఎదుట ఓ మహిళా రైతు వాపోయింది. వైసీపీ నిర్వహిస్తున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి గురువారం చిన్నమండెం మండలం కేశాపురం కస్పాలో పర్యటించారు. ఈ సందర్భంగా వరలక్ష్మి అనే మహిళా రైతు, ఆమె భర్త పంట నష్టపరిహారం పంపిణీ విషయంలో తమకు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యేని నిలదీశారు. చాలా మంది పంట సాగు చేయకపోయినా.. ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి రూ.70 వేలు, రూ.80 వేలు వచ్చాయని.. తమకు కనీసం రూ.10 వేలైనా పడకపోతే బాధగా ఉండదా..? అని ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ.. ‘మీ ఆవేశం నాకు అర్థమైంది. నేను చెప్పేది కూడా వినాలి...’ అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినిపించుకోకుండా.. తాము ఓట్లు వేస్తే మీరు మాకు ఏం చేశారని నిలదీశారు. ఈ గ్రామంలో చాలామందికి పంట నష్టపరిహారం పడలేదన్న విషయం ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది.

Read more