ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఏపీ సర్కారు కర్కశత్వం

ABN , First Publish Date - 2022-09-30T09:39:06+05:30 IST

ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఏపీ సర్కారు కర్కశత్వం

ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఏపీ సర్కారు కర్కశత్వం

కేసులు పెట్టి లోపలికి పంపిస్తోంది 

తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుంది

ఐదేళ్లలో 73ు ఫిట్‌మెంట్‌ ఇచ్చిన 

ఏకైక రాష్ట్రం మాదే: తెలంగాణ మంత్రి హరీశ్‌ 


సిద్దిపేట క్రైం, సెప్టెంబరు 29: ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం అక్కడి ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని, కేసులు నమోదు చేసి లోపలికి పంపిస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులతో స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. గురువారం సిద్దిపేటలో ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో ఐదేళ్లలో 73 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని ఆయన పేర్కొన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమానికి రూ.7,300 కోట్లు బడ్జెట్‌లో ప్రవేశపెట్టామన్నారు. ఉపాధ్యాయులకు కొన్ని సమస్యలు ఉన్నాయని, సాధ్యమైనంత వరకు సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. 

Read more